ప|| అదినీకు దారుకాణము అవునో కాదోకాని | కదిసి చెప్పగబోతే కతలయ్యీగాని ||
చ|| కలలోన నీరూపు కన్నుల గన్నట్లయ్యీ | చెలగి ఆసుద్ది చెప్ప జింతయ్యీగాని | వెలయ నీపలుకులు వీనుల విన్నట్లయ్యీ | సెలవి గమ్మర జెప్ప సిగ్గయ్యీగాని ||
చ|| మంతనాన నీతో మాటలాడి నట్లయ్యా | అంతట జూచితే వెరగయ్యీగాని | కంతు సమరతి నిన్ను గాగలించినట్లయ్యీ | పంతాన నేమనినాను పచ్చిదేరీగాని ||
చ|| వరుస నీమోవితేనె చవిగొన్న అట్లనయీ | వొరసి చూపబోతే గోరొత్తీగాని | ఇరవయిన శ్రీ వేంకటేశ నీవు ద్రిష్టముగా | సరుగ గూడిన నదె చాలాయగాని ||
pa|| adinIku dArukANamu avunO kAdOkAni | kadisi ceppagabOtE katalayyIgAni ||
ca|| kalalOna nIrUpu kannula gannaTlayyI | celagi Asuddi ceppa jiMtayyIgAni | velaya nIpalukulu vInula vinnaTlayyI | selavi gammara jeppa siggayyIgAni ||
ca|| maMtanAna nItO mATalADi naTlayyA | aMtaTa jUcitE veragayyIgAni | kaMtu samarati ninnu gAgaliMcinaTlayyI | paMtAna nEmaninAnu paccidErIgAni ||
ca|| varusa nImOvitEne cavigonna aTlanayI | vorasi cUpabOtE gOrottIgAni | iravayina SrI vEMkaTESa nIvu driShTamugA | saruga gUDina nade cAlAyagAni ||