అదివో నిత్యసూరులు అచ్యుత నీదాసులు యెదురులేనివారు యేకాంగవీరులు ॥పల్లవి॥
రచ్చల సంసారమనేరణరంగములోన తచ్చి కామక్రోధాలతలలు గొట్టి అచ్చపుతిరుమంత్రపుటారువుబొబ్బలతోడ యిచ్చలనే తిరిగేరు యేకాంగ వీరులు ॥అది॥
మొరసి పుట్టుగులనేముచ్చు బౌజుల కురికి తెరలి నడుములకు దెగవేసి పొరి గర్మము బొడిచి పోటుగంటుల దూరి యెరగొని తిరిగేరు యేకాంగవీరులు ॥అది॥
వొడ్డినదేహములనేవూళ్ళలోపల చొచ్చి చెడ్డయహంకారమును చెఱలు పట్టి అడ్డమై శ్రీవేంకటేశు నుండనుండి లోకులనే యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు ॥అది॥
Adivo nityasoorulu achyuta needaasulu Yedurulenivaaru yekaangaveerulu |pallavi|
Rachchala samsaaramaneranarangamulona Tachchi kaamakrodhaalatalalu gotti Achchaputirumantraputaaruvubobbalatoda Yichchalane tirigeru yekaanga veerulu |adi|
Morasi puttugulanemuchchu baujula kuriki Terali nadumulaku degavesi Pori garmamu bodichi potugamtula doori Yeragoni tirigeru yekaangaveerulu |adi|
Voddinadehamulanevoollalopala chochchi Cheddayahankaaramunu cheralu patti Addamai sreevenkatesu nundanundi lokulane Yeddala joochi navveru yekaangaveerulu |adi|