ప|| అలర నుతించరో హరిని | యెలయించి మిము భ్రమయించీనీ గాలము ||
చ|| సేయరో మనుజులారా చింత హరి నికనైన | రోయరో మీ భుజియించు రుచుల మీద |
కాయమస్థిరము యీకవి యధృవము చాల- | బోయబో యెందుకు గాకపోయ గాలము ||
చ|| మెచ్చరో మనుజులార మీరే హరికథలు | పుచ్చరో మీ మదిలోని పొరలెల్లాను |
కొచ్చరో మనుజులార కోరిక లెల్లను మీకు | నిచ్చీని శుభములు యివి యెల్లకాలము ||
చ|| కనరో వేంకటపతి గన్నులు దనియగా | వినరో యీతని స్తుతు వీనులు నిండ |
మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు | తనమీది మదిబుద్ది దాచీనీ గాలము ||
pa|| alara nutiMcarO harini | yelayiMci mimu BramayiMcInI gAlamu ||
ca|| sEyarO manujulArA ciMta hari nikanaina | rOyarO mI BujiyiMcu rucula mIda | kAyamasthiramu yIkavi yadhRuvamu cAla- | bOyabO yeMduku gAkapOya gAlamu ||
ca|| meccarO manujulAra mIrE harikathalu | puccarO mI madilOni poralellAnu | koccarO manujulAra kOrika lellanu mIku | niccIni SuBamulu yivi yellakAlamu ||
ca|| kanarO vEMkaTapati gannulu daniyagA | vinarO yItani stutu vInulu niMDa | manarO SrIharicEti mannanalu mIru | tanamIdi madibuddi dAcInI gAlamu ||