ప|| అంగనలీరే హారతులు| అంగజగురునకు నారతులు
చ|| శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి ఆదిత్య తేజున కారతులు
చ|| సురలకు నమౄతము సొరది నొసంగిన హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన అరి భయంకరున కారతులు
చ|| నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి అచ్యుతునకు నివె యారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ యచ్చుగ నిలిచిరి యారతులు
pa|| aMganalIrE hAratulu|aMgajagurunaku nAratulu||
ca|| SrIdEvi tODuta jelagucu navvE Adima puruShuni kAratulu|
mEdinI ramaNi mElamu lADETi Aditya tEjuna kAratulu||
ca|| suralaku namRutamu soradi nosaMgina hari kivO pasiDAratulu|
taramidi duShTula danujula naDacina ari BayaMkaruna kAratulu||
ca|| niccalu kalyANa nidhiyai yEgETi acyutunaku nive yAratulu|
cocci SrI vEMkaTESuDu nalamElmaMga yaccuga niliciri yAratulu ||