ana niMkE munnadi - అన నింకే మున్నది

ప|| అన నింకే మున్నది అలుగ నేమున్నది | కనుగొనలనే చూచి కరగుట గాక ||

చ|| నవ్వూ నవ్వా జెల్లును నాలి సెయ జెల్లు నీకు | రవ్వగా నే మోహించి రాపైన యందుకు |

యెవ్వరితో దగవూ లిక నాడే నేను | జవ్వనాన నొంటి నేను జడియుట గాక |

చ|| బిగియూ నమరునూ బీరాలు నమరునూ | తగవు లెంచక నిన్ను దగ్గరిన యందుకు |

జగడమూ జెల్లదూ సాదించ జెల్లదూ | మొగమోటమున నేనే ములుగుట గాక ||

చ|| సరసము దక్కెనూ చనవెలా నెక్కెనూ | మరగి నీ కౌగిట నేను మఱచిన యందుకు |

తెరయెత్త బనిలేదు దిష్టము శ్రీ వేంకటేశ | సరుగ నీ రతిజిక్కి సత మౌట గాక ||

pa|| ana niMkE munnadi aluga nEmunnadi | kanugonalanE cUci karaguTa gAka ||

ca|| navvU navvA jellunu nAli seya jellu nIku | ravvagA nE mOhiMci rApaina yaMduku | yevvaritO dagavU lika nADE nEnu | javvanAna noMTi nEnu jaDiyuTa gAka |

ca|| bigiyU namarunU bIrAlu namarunU | tagavu leMcaka ninnu daggarina yaMduku | jagaDamU jelladU sAdiMca jelladU | mogamOTamuna nEnE muluguTa gAka ||

ca|| sarasamu dakkenU canavelA nekkenU | maragi nI kaugiTa nEnu marxacina yaMduku |

terayetta banilEdu diShTamu SrI vEMkaTESa | saruga nI ratijikki sata mauTa gAka ||