ప|| అనాది జగమునకౌ భళము | అనేకాద్భుతంబౌ భళము ||
చ|| హరి నివాస మీయౌ భళము | అరిది పరమ పదమౌ భళము|
అరిదైత్యాంతకమౌ భళము | హరముఖ సేవితమౌ భళము ||
చ|| అమలరమాకరమౌ భళము | అమితమునీంద్రంబౌ భళము |
అమరవందితంబౌ భళము | అమరె బుణ్యములనౌ భళము ||
చ|| అగరాజంబీ యౌ భళము | అగణిత తీర్థంబౌ భళము |
తగు శ్రీవేంక ధామ విహారం- | బగు శుభాంచితంబౌ భళము||
pa|| anAdi jagamunakau BaLamu | anEkAdButaMbau BaLamu ||
ca|| hari nivAsa mIyau BaLamu | aridi parama padamau BaLamu| aridaityAMtakamau BaLamu | haramuKa sEvitamau BaLamu ||
ca|| amalaramAkaramau BaLamu | amitamunIMdraMbau BaLamu | amaravaMditaMbau BaLamu | amare buNyamulanau BaLamu ||
ca|| agarAjaMbI yau BaLamu | agaNita tIrthaMbau BaLamu | tagu SrIvEMka dhAma vihAraM- | bagu SuBAMcitaMbau BaLamu||