ప|| అన్నిచోట్ల బరమాత్మవు నీవు | యిన్నిరూపుల భ్రమయింతువుగా ||
చ|| పాలజలధి నుండి బదరీవనాన నుండి | ఆలయమై గయలో బ్రయాగ నుండి |
భూలోకనిధివై పురుషోత్తమాన నుండి | వేలసంఖ్యలరూపై విచ్చేతుగా ||
చ|| వుత్తరమధురలో నయోధ్యలోపల నుండి | సత్తైననందవ్రజాన నుండి |
చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి | వత్తుగా లోకములు పావనము సేయగను ||
చ|| కైవల్యమున నుండి కమలజలోకాన | మోవగ శ్రీరంగమున నుండి |
యీవల నావల నుండి యీవేంకటాద్రిపై నీవే నీవే వచ్చి నెలకొంటిగా ||
pa|| annicOTla baramAtmavu nIvu | yinnirUpula BramayiMtuvugA ||
ca|| pAlajaladhi nuMDi badarIvanAna nuMDi | Alayamai gayalO brayAga nuMDi | BUlOkanidhivai puruShOttamAna nuMDi | vElasaMKyalarUpai viccEtugA ||
ca|| vuttaramadhuralO nayOdhyalOpala nuMDi | sattainanaMdavrajAna nuMDi | cittagiMci paMcavaTi siMhAdrilOna nuMDi | vattugA lOkamulu pAvanamu sEyaganu ||
ca|| kaivalyamuna nuMDi kamalajalOkAna | mOvaga SrIraMgamuna nuMDi | yIvala nAvala nuMDi yIvEMkaTAdripai nIvE nIvE vacci nelakoMTigA ||