ప|| అన్నిటా జాణ వౌదువు ఓభళేశ్వర | యెన్ని చూచుకొంటేను ఇట్టుండు మోహము ||
చ|| మరు గొండలపైన నుండి మగువ బాయగ లేక | కోరివచ్చితి విందిర గుడిలోనికి |
ఆరితేరిన దేవుడ వగ్గళ్ళురుకుదురా | యేరీతి వారికైనా నిట్టుండు మోహము ||
చ|| నడుమను భవనాశినిది వారుచుండగాను | కడు దాటి వచ్చితివి కాంతయింటికి |
వడి బారగానేరీది వత్తురా సాహసమున | యెడయ కెవ్వరికైనా నిట్టుండు మోహము ||
pa|| anniTA jANa vauduvu OBaLESvara | yenni cUcukoMTEnu iTTuMDu mOhamu ||
ca|| maru goMDalapaina nuMDi maguva bAyaga lEka | kOrivacciti viMdira guDilOniki | AritErina dEvuDa vaggaLLurukudurA | yErIti vArikainA niTTuMDu mOhamu ||
ca|| naDumanu BavanASinidi vArucuMDagAnu | kaDu dATi vaccitivi kAMtayiMTiki |
vaDi bAragAnErIdi vatturA sAhasamuna | yeDaya kevvarikainA niTTuMDu mOhamu ||