ప|| అన్నిట నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను | యెన్నగ నీవొక్కడవేగతియని యెంచికొలుచుటే ప్రపన్న సంగతి ||
చ|| ఏకాంతంబున నుండినపతివి యెనసిరమించుటే సతిధర్మంబు | లోకమురచ్చలోనుండినపతి లోగొని పైకొనరానట్లు |
యీకొలదులనే సర్వదేవతలయిన్నిరూపులై నీవున్నప్పుడు | కైకొని నిను బహుముఖముల గొలుచుట గాదు పతివ్రత ధర్మంబు ||
చ|| పూనినబ్రాహ్మాణులలోపలనే నిను బూజించుట వేదోక్తధర్మము | శ్వానకుక్కుటాదులలోపల నిను సరి బూజించగరానట్లు |
యీనియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీశరణాగతజనులను | కానక, వొక్కట సరిగాజూచుట కాద వివేకధర్మంబు ||
చ|| శ్రీవేంకటపతి గురువనుమతినే సేవే నాకును శిష్యధర్మము | ఆవలనీవల నితరమార్గముల యాత్మలోన రుచిగానట్లు |
భావింపగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము | కైవశమై యిన్నిటా వెనుతగులు కాద వివేకధర్మంబు ||
pa|| anniTa nI vaMtaryAmivi avuTa dharmamE ayinAnu | yennaga nIvokkaDavEgatiyani yeMcikolucuTE prapanna saMgati ||
ca|| EkAMtaMbuna nuMDinapativi yenasiramiMcuTE satidharmaMbu | lOkamuraccalOnuMDinapati lOgoni paikonarAnaTlu |
yIkoladulanE sarvadEvatalayinnirUpulai nIvunnappuDu | kaikoni ninu bahumuKamula golucuTa gAdu pativrata dharmaMbu ||
ca|| pUninabrAhmANulalOpalanE ninu bUjiMcuTa vEdOktadharmamu | SvAnakukkuTAdulalOpala ninu sari bUjiMcagarAnaTlu |
yIniyamamulane prAkRutajanulanu yISvara nISaraNAgatajanulanu | kAnaka, vokkaTa sarigAjUcuTa kAda vivEkadharmaMbu ||
ca|| SrIvEMkaTapati guruvanumatinE sEvE nAkunu SiShyadharmamu | AvalanIvala nitaramArgamula yAtmalOna rucigAnaTlu |
BAviMpaga sakalaprapaMcamunu brahmaM satyaj~jAnamanaMtamu | kaivaSamai yinniTA venutagulu kAda vivEkadharmaMbu ||