ప|| అణురేణుపరిపూర్ణుడైన శ్రీవల్లభుని | బ్రణుతించువారువో బ్రాహ్మలు ||
చ|| హరినామములనె సంధ్యాదివిధు లొనరించు- | పరిపూర్ణమతులువో బ్రాహ్మలు |
హరిమంత్ర వేదపారాయణులు హరిభక్తి- | పరులైన వారువో బ్రాహ్మలు ||
చ|| ఏవిచూచినను హరి యిన్నిటా గలడనుచు- | భావించువారువో బ్రాహ్మలు |
దేవకీనందనుడె దేవుడని మతిదెలియు- | పావనులు వారువో బ్రాహ్మలు ||
చ|| ఆదినారాయణుని ననయంబు దమయాత్మ | బాదుకొలిపనవారు బ్రాహ్మలు |
వేదరక్షకుడైన వేంకటగిరీశ్వరుని- | పాదసేవకులువో బ్రాహ్మలు ||
pa|| aNurENuparipUrNuDaina SrIvallaBuni | braNutiMcuvAruvO brAhmalu ||
ca|| harinAmamulane saMdhyAdividhu lonariMcu- | paripUrNamatuluvO brAhmalu | harimaMtra vEdapArAyaNulu hariBakti- | parulaina vAruvO brAhmalu ||
ca|| EvicUcinanu hari yinniTA galaDanucu- | BAviMcuvAruvO brAhmalu |
dEvakInaMdanuDe dEvuDani matideliyu- | pAvanulu vAruvO brAhmalu ||
ca|| AdinArAyaNuni nanayaMbu damayAtma | bAdukolipanavAru brAhmalu | vEdarakShakuDaina vEMkaTagirISvaruni- | pAdasEvakuluvO brAhmalu ||