ప|| అప్పటికప్పుడే కాక అంత యేటికి | యెప్పుడూ మనకు బోదు ఇందవయ్య విడెము ||
చ|| తక్కి మాటున నున్నంత తడవు నిను దూరితి | నిక్కిచూడ బోతేను నీవే నేను |
కక్కసించనిక నిన్ను కడు నాసవెట్టకిక | యిక్కువలు గరగేను ఇందవయ్య విడెము ||
చ|| గుట్టుతో నూరకుండగా గుణము వెరపులాయ | నెట్టుకొని మాటాడితే నీవే నేను |
పెట్టను రట్ల నిన్ను పెనగకుమిక నీవు | ఇట్టే నీమాటలు వింటి నిందవయ్య విడెము ||
చ|| అరయ దూరకున్నందు కటునిటు బిగిసితి | నేరిచి పొందు సేసితే నీవే నేను |
కోరి శ్రీ వేంకటేశుడ కూడితి మిద్దరమును | యీరీతి బాయకుందము ఇందవయ్య విడెము ||
pa|| appaTikappuDE kAka aMta yETiki | yeppuDU manaku bOdu iMdavayya viDemu ||
ca|| takki mATuna nunnaMta taDavu ninu dUriti | nikkicUDa bOtEnu nIvE nEnu | kakkasiMcanika ninnu kaDu nAsaveTTakika | yikkuvalu garagEnu iMdavayya viDemu ||
ca|| guTTutO nUrakuMDagA guNamu verapulAya | neTTukoni mATADitE nIvE nEnu | peTTanu raTla ninnu penagakumika nIvu | iTTE nImATalu viMTi niMdavayya viDemu ||
ca|| araya dUrakunnaMdu kaTuniTu bigisiti | nErici poMdu sEsitE nIvE nEnu | kOri SrI vEMkaTESuDa kUDiti middaramunu | yIrIti bAyakuMdamu iMdavayya viDemu ||