ప|| అతడే యెరుగును మముబుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుడు |
అతికీనతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారంబిక నేదో ||
చ|| కనుచున్నారము సూర్యచంద్రులకు ఘన వుదయాస్తమయములు |
వినుచున్నారము తొల్లిటివారల విశ్వములోపలి కథలెల్లా |
మనుచున్నారము నానాటికి మాయల సంసారములోన |
తనిసీ దనియము తెలిసీ దెలియము తరువాతి పనులిక నేవో ||
చ|| తిరిగెదమిదివో ఆసలనాసల దిక్కుల నర్ధార్జన కొరకు |
పొరలెదమిదివో పుణ్యపాపముల భోగములందే మత్తులమై |
పెరిగెదమిదివో చచ్చెడి పుట్టెడి భీతుగలుగు దేహములలోనే |
విరసము లెరగము మరచీ మరవము వెనకటి కాలము విధియేదో ||
చ|| అట్లైనారము హరినుతిచే నాఱడి (బోవక) గురువనుమతిని |
పట్టినారమిదె భక్తిమార్గమిదె (మును) బలువగు విజ్ఞానముచేత |
గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటిమిదివొ మోక్షము తెరువు |
ముట్టీముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో ||
pa|| ataDE yerugunu mamubuTTiMcina yaMtarAtmayagu nISvaruDu |
atikInatukadu cittaSAMti yide AtmavihAraMbika nEdO ||
ca|| kanucunnAramu sUryacaMdrulaku Gana vudayAstamayamulu |
vinucunnAramu tolliTivArala viSvamulOpali kathalellA |
manucunnAramu nAnATiki mAyala saMsAramulOna |
tanisI daniyamu telisI deliyamu taruvAti panulika nEvO ||
ca|| tirigedamidivO AsalanAsala dikkula nardhArjana koraku |
poraledamidivO puNyapApamula BOgamulaMdE mattulamai |
perigedamidivO cacceDi puTTeDi BItugalugu dEhamulalOnE |
virasamu leragamu maracI maravamu venakaTi kAlamu vidhiyEdO ||
ca|| aTlainAramu harinuticE nArxaDi (bOvaka) guruvanumatini |
paTTinAramide BaktimArgamide (munu) baluvagu vij~jAnamucEta |
gaTTiga SrIvEMkaTapati SaraNani kaMTimidivo mOkShamu teruvu |
muTTImuTTamu paTTIpaTTamu muMdaTi kaiMkaryaMbEdO ||