ప|| అతనికెట్ల సతమైతినో కడు- | హితవో పొందులహితవో యెఱగ ||
చ|| హృదయము తలపున నిరవయినగదా | పదిలమౌను లోపలిమాట |
వెదకినచిత్తము వెర వెఱుగదు నే- | నెదిరి నెఱగ నే నేమియు నెఱగ ||
చ|| కాలూద మనసుగలిగినకదా నా- | తాలిమి మతిలో దగులౌట |
మేలిమిపతితో మెలగుటేదో నే- | నేలో నే నిపుడెక్కడో యెఱగ ||
చ|| నేడని రేపని నే నెఱిగికదా | పోడిమి మతిలో పొలుపౌట |
వాడే వేంకటేశ్వరుడు రాగలిగె | ఆడుజన్మ మేనౌటిది యెఱగ ||
pa|| atanikeTla satamaitinO kaDu- | hitavO poMdulahitavO yerxaga ||
ca|| hRudayamu talapuna niravayinagadA | padilamaunu lOpalimATa |
vedakinacittamu vera verxugadu nE- | nediri nerxaga nE nEmiyu nerxaga ||
ca|| kAlUda manasugaliginakadA nA- | tAlimi matilO dagulauTa |
mElimipatitO melaguTEdO nE- | nElO nE nipuDekkaDO yerxaga ||
ca|| nEDani rEpani nE nerxigikadA | pODimi matilO polupauTa |
vADE vEMkaTESvaruDu rAgalige | ADujanma mEnauTidi yerxaga ||