ప|| అటు గుడువు మనస నీ వన్నిలాగుల బొరలి | ఇటు గలిగె నీకు నైహికవిచారములు ||
చ|| కోరికలకును గలిగె ఘోరపరితాపంబు | కూరిమికి గలిగె ననుకూలదుఃఖములు |
తారతమ్యములేని తలపోతలకు గలిగె | భారమైనట్టి లంపటమనెడిమోపు ||
చ|| తనువునకు గలిగె సంతతమైనతిమ్మటలు | మనువునకు గలిగె నామవికారములు |
పనిలేని సంసార బంధంబునకు గలిగె | ఘనమైన దురిత సంగతితోడి చెలిమి ||
చ|| దేహికిని గలిగె నింద్రియములను బోధింప | దేహంబునకు గలిగె తెగనిసంశయము |
దేహాత్మకుండయిన తిరువేంకటేశునకు | దేహిదేహాంతరస్థితి జూడగలిగె ||pa|| aTu guDuvu manasa nI vannilAgula borali | iTu galige nIku naihikavicAramulu ||
ca|| kOrikalakunu galige GOraparitApaMbu | kUrimiki galige nanukUladuHKamulu | tAratamyamulEni talapOtalaku galige | BAramainaTTi laMpaTamaneDimOpu ||
ca|| tanuvunaku galige saMtatamainatimmaTalu | manuvunaku galige nAmavikAramulu |
panilEni saMsAra baMdhaMbunaku galige | Ganamaina durita saMgatitODi celimi ||
ca|| dEhikini galige niMdriyamulanu bOdhiMpa | dEhaMbunaku galige teganisaMSayamu |
dEhAtmakuMDayina tiruvEMkaTESunaku | dEhidEhAMtarasthiti jUDagalige ||