ప|| అవి యటు భావించినట్లాను | కవగొని యిందుకు గలగరు ఘనులు ||
చ|| అరయగ నేబదియక్షరములె పో | ధరలోపల నిందాస్తుతులు |
సరి బురాణములు శాస్త్రవేదములు | యింపుగ పన్నియు నిండి పొడమె ||
చ|| వొక్కదేహమున నున్నయంగములు | పెక్కువిధములై బెరసినివి |
చిక్కుల గొన్నిటి సిగ్గుల దాతురు | యెక్కువయతులకు నిన్నియు సమము ||
చ|| అంతరాత్మలో నంతర్యామై | బంతుల దిరిగేటిబంధువులు |
చింతింప నతడే శ్రీవేంకటేశ్వరు- | డింతకు గర్తని యెంతురు బుధులు ||
pa|| avi yaTu BAviMcinaTlAnu | kavagoni yiMduku galagaru Ganulu ||
ca|| arayaga nEbadiyakSharamule pO | dharalOpala niMdAstutulu |
sari burANamulu SAstravEdamulu | yiMpuga panniyu niMDi poDame ||
ca|| vokkadEhamuna nunnayaMgamulu | pekkuvidhamulai berasinivi |
cikkula gonniTi siggula dAturu | yekkuvayatulaku ninniyu samamu ||
ca|| aMtarAtmalO naMtaryAmai | baMtula dirigETibaMdhuvulu |
ciMtiMpa nataDE SrIvEMkaTESvaru- | DiMtaku gartani yeMturu budhulu ||