ప|| అవునయ్య నీ సుద్దు లటు వంటివి | జవళితో నంటు బచ్చలి వంటి వాడవు ||
చ|| చెలరేగి యేడ లేని చేతలెల్లా జేసివచ్చి | వెలయు నిప్పుడు నన్ను వేడుకొనేవు |
పలుమారు నీచేత బాసలు గొన వెరతు | కలువ కంటుల యెడ కాత రీడ వనుచు ||
చ|| వాడ వారిపై నెల్లా వలపుల చల్లి వచ్చి | యీడ నాతో నెడలేని యిచ్చలాడేవు |
కోడె కాడ నీ వోజ కొనియాడ నిచ్చితయ్యీ | జాడతో నింతుల యెడ చంచలుడ వనుచు ||
చ|| పెక్కు గోపికల నెల్లా బెండ్లాడి యిట వచ్చి | గక్కన నా కౌగిట గలసితివి |
నిక్కి శ్రీ వేంకటేశుడ నే నలమేల్మంగను | కక్కసించ నోప నీవు గబ్బి వాడవనుచు ||
pa|| avunayya nI suddu laTu vaMTivi | javaLitO naMTu baccali vaMTi vADavu ||
ca|| celarEgi yEDa lEni cEtalellA jEsivacci | velayu nippuDu nannu vEDukonEvu | palumAru nIcEta bAsalu gona veratu | kaluva kaMTula yeDa kAta rIDa vanucu ||
ca|| vADa vAripai nellA valapula calli vacci | yIDa nAtO neDalEni yiccalADEvu |
kODe kADa nI vOja koniyADa niccitayyI | jADatO niMtula yeDa caMcaluDa vanucu ||
ca|| pekku gOpikala nellA beMDlADi yiTa vacci | gakkana nA kaugiTa galasitivi | nikki SrI vEMkaTESuDa nE nalamElmaMganu | kakkasiMca nOpa nIvu gabbi vADavanucu ||