ప|| అయ్యో నేనేకా అన్నిటికంటె దీలు | గయ్యాళినై వ్రిధా గర్వింతుగాని ||
చ|| తడిపివుదికినట్టిధౌతవస్త్రములు నా- | యొడలు మోచినమీద యోగ్యము గావు | వుడివోక వనములో వొప్పైనవిరులు నే- | ముడిచివేసినంతనే ముట్టరాదాయను ||
చ|| వెక్కసపురచనలవేవేలురుచులు నా- | వొకనాలు కంటితేనే యోగ్యముగావు | పక్కనదేవార్హపుబరిమళ గంధములు నా- | ముక్కుసోకినంతలోనే ముట్టరాదాయను ||
చ|| గగనానుండి వచ్చేగంగాజలములైన | వొగి నాగోరంటితేనె యోగ్యము గావు | నగుశ్రీవేంకటపతి నన్నే రక్షించినదాక | మొగడై యెరుకతుది ముట్టరాదాయను ||
pa|| ayyO nEnEkA anniTikaMTe dIlu | gayyALinai vridhA garviMtugAni ||
ca|| taDipivudikinaTTidhautavastramulu nA- | yoDalu mOcinamIda yOgyamu gAvu | vuDivOka vanamulO voppainavirulu nE- | muDicivEsinaMtanE muTTarAdAyanu ||
ca|| vekkasapuracanalavEvEluruculu nA- | vokanAlu kaMTitEnE yOgyamugAvu | pakkanadEvArhapubarimaLa gaMdhamulu nA- | mukkusOkinaMtalOnE muTTarAdAyanu ||
ca|| gaganAnuMDi vaccEgaMgAjalamulaina | vogi nAgOraMTitEne yOgyamu gAvu | naguSrIvEMkaTapati nannE rakShiMcinadAka | mogaDai yerukatudi muTTarAdAyanu ||