ప|| ఈ జీవునకు నేది గడపల తనకు | నేజాతియును లేక యిట్లున్నవాడు ||
చ|| బహుదేహ కవచముల బారవేసినవాడు | బహుస్వతంత్రముల నాపదనొందినాడు |
బహుకాలముల మింగి పరవశంబైనవాడు | బహు యోనికూపములబడి వెడలినాడు ||
చ|| పెక్కుబాసలు నేర్చి పెంపుమిగిలినవాడు | పెక్కునామములచే బిలువబడినాడు |
పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ | పెక్కులాగుల బెనగి చెండుపడినాడు ||
చ|| ఉండనెన్నడు దనకు ఊరటెన్నడులేక | యెండలకు నీడలకు యెడతాకినాడు |
కొండలలో నెలకొన్న కోనేటిరాయని | యండ జేరెదననుచు నాసపడినాడు ||
pa|| I jIvunaku nEdi gaDapala tanaku | nEjAtiyunu lEka yiTlunnavADu ||
ca|| bahudEha kavacamula bAravEsinavADu | bahusvataMtramula nApadanoMdinADu |
bahukAlamula miMgi paravaSaMbainavADu | bahu yOnikUpamulabaDi veDalinADu ||
ca|| pekkubAsalu nErci peMpumigilinavADu | pekkunAmamulacE biluvabaDinADu |
pekkukAMtalatODa pekkupuruShulatODa | pekkulAgula benagi ceMDupaDinADu ||
ca|| uMDanennaDu danaku UraTennaDulEka | yeMDalaku nIDalaku yeDatAkinADu |
koMDalalO nelakonna kOnETirAyani | yaMDa jEredananucu nAsapaDinADu ||