ప|| ఈభవమునకు జూడ నేది గడపల తనదు- | ప్రాభవం బెడలించి బాధ పెట్టించె ||
చ|| చెప్పించె బ్రియము వలసినవారలకునెల్ల | రప్పించె నెన్నడును రానిచోట్లకును |
నొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను | తిప్పించె కోరికల తిరిగి నలుగడల ||
చ|| పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల | కట్టించె సంసారకలితబంధముల |
పెట్టించె ఆసలను పెడకొడముల దన్ను | తిట్టించె నిజద్రవ్యదీనకులచేత ||
చ|| బెదరించె దేహంబు పెనువేదనలచేత | చెదరించె శాంతంబు చెలగి చలమునను |
విదళించె భవములను వేంకటేశ్వరు గొలిచి | పదిలించె నతనికృప పరమసౌఖ్యములు ||
pa|| IBavamunaku jUDa nEdi gaDapala tanadu- | prABavaM beDaliMci bAdha peTTiMce ||
ca|| ceppiMce briyamu valasinavAralakunella | rappiMce nennaDunu rAnicOTlakunu |
noppiMce nAsalaku vOraMta proddunanu | tippiMce kOrikala tirigi nalugaDala ||
ca|| puTTiMce hEyaMpuBOgayOnulanella | kaTTiMce saMsArakalitabaMdhamula |
peTTiMce Asalanu peDakoDamula dannu | tiTTiMce nijadravyadInakulacEta ||
ca|| bedariMce dEhaMbu penuvEdanalacEta | cedariMce SAMtaMbu celagi calamunanu |
vidaLiMce Bavamulanu vEMkaTESvaru golici | padiliMce natanikRupa paramasauKyamulu ||