ప|| ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకు దగు | గద్దరికన్నుల జూడ గలిగెగా మనకు ||
చ|| పంతపు చెలిచన్నుల పసిడి కాంతులకు | కాంతుని పీతాంబరపు కాంతులు సరి | దొంతల చెలినీలపుతురుము కాంతులకు | వంతుల మేనినీలవర్ణము సరి ||
చ|| జలజాక్షి వెలలేని జఘనచక్రమునకు | చలమరివల కేలిచక్రము సరి | కులికేటి యీయింతి కుత్తిక శంఖమునకు | చలివాయ రమణుని శంఖము సరి ||
చ|| కమలాక్షి శ్రీవేంకటపతి గూడుటకు | రమణుడంటిన సమరతులు సరి | తమితోడి నిద్దరికి తారుకాణలై నట్టి | సముకపు మోహముల సంతసములు సరి ||
pa|| iddari kiddarE sari yIDuku jODuku dagu | gaddarikannula jUDa galigegA manaku ||
ca|| paMtapu celicannula pasiDi kAMtulaku | kAMtuni pItAMbarapu kAMtulu sari | doMtala celinIlaputurumu kAMtulaku | vaMtula mEninIlavarNamu sari ||
ca|| jalajAkShi velalEni jaGanacakramunaku | calamarivala kElicakramu sari | kulikETi yIyiMti kuttika SaMKamunaku | calivAya ramaNuni SaMKamu sari ||
ca|| kamalAkShi SrIvEMkaTapati gUDuTaku | ramaNuDaMTina samaratulu sari | tamitODi niddariki tArukANalai naTTi | samukapu mOhamula saMtasamulu sari ||