ప|| ఇదె నీ కన్నుల యెదిటికివచ్చితి | కదియుచు నెట్లైన గావక పోదు ||
చ|| పరమపురుష నీ భక్తి దొరకకనే | ఇరవగు జన్మము లెత్తితిని | హరి నీకరుణకు నరుహము లేకనే | దురితవిదుల సందుల బడితిని ||
చ|| జగదీశ్వర నీ శరణము లేకనే | వొగి సంసారపు వురి బడితి | భగవంతుడ నీ పదములు గనకనే | తెగని పాపముల తీదీపు లైతి ||
చ|| గోవిందుడ నిను కొలువగ నేరకనే | ధావతి యాసల తగిలితిని | శ్రీ వేంకటేశ్వర చేరి నీవు నా | దైవమవు కాగ ధన్నుడ నయితి ||
pa|| ide nI kannula yediTikivacciti | kadiyucu neTlaina gAvaka pOdu ||
ca|| paramapuruSha nI Bakti dorakakanE | iravagu janmamu lettitini | hari nIkaruNaku naruhamu lEkanE | duritavidula saMdula baDitini ||
ca|| jagadISvara nI SaraNamu lEkanE | vogi saMsArapu vuri baDiti | BagavaMtuDa nI padamulu ganakanE | tegani pApamula tIdIpu laiti ||
ca|| gOviMduDa ninu koluvaga nErakanE | dhAvati yAsala tagilitini | SrI vEMkaTESvara cEri nIvu nA | daivamavu kAga dhannuDa nayiti ||