ప|| ఈదేహ వికారమునకు నేదియు గడపల ఘనము | మోదమెరంగని మోహము ముందర గననీదు ||
చ|| నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు | సత్యాలాపవిచారము జరగదు లోభికిని |
హత్యావిరహిత కర్మము అంటదు క్రూరాత్మునకును | ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు ||
చ|| సతతానందవికాసము సంధించదు తామసునకు | గతకల్మష భావము దొరకదు వ్యసనికిని |
జితకాముడు దానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి | అతులితగంభీర గుణంబలవడ దధమునకు ||
చ|| శ్రీవేంకటగిరి వల్లభుసేవా తత్పరభావము- | ద్రోవ మహాలంపటులకు తోపదు తలపునకు |
దేవోత్తముడగు నీతని దివ్యామృతమగు నామము | సేవింపగ నితరులకును చిత్తంబొడబడదు ||
pa|| IdEha vikAramunaku nEdiyu gaDapala Ganamu | mOdameraMgani mOhamu muMdara gananIdu ||
ca|| nityAnityavivEkamu nIrasunaku nonagUDadu | satyAlApavicAramu jaragadu lOBikini |
hatyAvirahita karmamu aMTadu krUrAtmunakunu | pratyakShaMbagu pApamu pAyadu kaShTunaku ||
ca|| satatAnaMdavikAsamu saMdhiMcadu tAmasunaku | gatakalmaSha BAvamu dorakadu vyasanikini |
jitakAmuDu dAnavuTaku siddhiMpadu duShkarmiki | atulitagaMBIra guNaMbalavaDa dadhamunaku ||
ca|| SrIvEMkaTagiri vallaBusEvA tatparaBAvamu- | drOva mahAlaMpaTulaku tOpadu talapunaku |
dEvOttamuDagu nItani divyAmRutamagu nAmamu | sEviMpaga nitarulakunu cittaMboDabaDadu ||