ప|| ఇదియే వేదాంత మిందుకంటె లేదు | ఇదియే శ్రీవేంకటేశుని మతము ||
చ|| విరతియే లాభము విరతియే సౌఖ్యము | విరతియేపో విజ్ఞానము |
విరతిచే ఘనులైరి వెనుక వారెల్ల | విరతి బొందకున్న వీడదు భయము ||
చ|| చిత్తమే పాపము చిత్తమే పుణ్యము | చిత్తమే మోక్షసిద్ధియును |
చిత్తమువలనే శ్రీహరి నిలుచును | చిత్తశాంతిలేక చేరదు పరము ||
చ|| ఎంత చదివినా యెంత వెదికినా | యింతకంటె మరియిక లేదు |
ఇంతట శ్రీవేంకటేశు దాసులౌట | యెంతవారికైన యిదియే తెరవు ||
pa|| idiyE vEdAMta miMdukaMTe lEdu | idiyE SrIvEMkaTESuni matamu ||
ca|| viratiyE lABamu viratiyE sauKyamu | viratiyEpO vij~jAnamu |
viraticE Ganulairi venuka vArella | virati boMdakunna vIDadu Bayamu ||
ca|| cittamE pApamu cittamE puNyamu | cittamE mOkShasiddhiyunu |
cittamuvalanE SrIhari nilucunu | cittaSAMtilEka cEradu paramu ||
ca|| eMta cadivinA yeMta vedikinA | yiMtakaMTe mariyika lEdu |
iMtaTa SrIvEMkaTESu dAsulauTa | yeMtavArikaina yidiyE teravu ||