ప|| ఇందిరానాయక యిదివో మాపాటు | చెంది నీవే గతి చేకొనవయ్యా ||
చ|| తీసీ గోరికతీదీపు లొకవంక | లాసీ సంసారలంపటము |
మూసీ గర్మము మునుకొని పరచింత | సేసేదేమిక జెప్పేదేమి ||
చ|| వంచీ నాసలు వలసినచోటికి | పొంచీ దుర్గుణభోగములు |
ముంచీ యౌవన మోహాంధకారము | యెంచేదేమి సోదించేదేమి ||
చ|| ఎరిగీ జిత్తము యించుకించుక నిన్ను | మరవని నీపైభక్తి మతినుండగా |
నెరి శ్రీవేంకటపతి నీవే కాతువుగాక | వెరచి నేజేసే విన్నపమేమి ||
pa|| iMdirAnAyaka yidivO mApATu | ceMdi nIvE gati cEkonavayyA ||
ca|| tIsI gOrikatIdIpu lokavaMka | lAsI saMsAralaMpaTamu |
mUsI garmamu munukoni paraciMta | sEsEdEmika jeppEdEmi ||
ca|| vaMcI nAsalu valasinacOTiki | poMcI durguNaBOgamulu |
muMcI yauvana mOhAMdhakAramu | yeMcEdEmi sOdiMcEdEmi ||
ca|| erigI jittamu yiMcukiMcuka ninnu | maravani nIpaiBakti matinuMDagA |
neri SrIvEMkaTapati nIvE kAtuvugAka | veraci nEjEsE vinnapamEmi ||