ప|| ఇందు నుండి మీకెడలేదు | సందడి సేయక చనరో మీరు ||
చ|| నాలుక శ్రీహరి నామంబున్నది | తూలుచు బారరొ దురితముల |
చాలి భుజంబున చక్రంబున్న | తారిమి భవబంధములటు తొలగరో ||
చ|| అంతర్యామై హరి వున్నాడిదె | చింతలు వాయరొ చిత్తమున |
వింతలు జెవులను విష్ణుకథలివిగొ | పొంత గర్మములు పోరో మీరు ||
చ|| కాపయి శ్రీ వేంకటపతి పేరిదె | నాపై నున్నది నయమునను |
కోప(పు) కామాది గుణములాల మీ- | రేపున కడగడ నెందైన బోరొ ||
pa|| iMdu nuMDi mIkeDalEdu | saMdaDi sEyaka canarO mIru ||
ca|| nAluka SrIhari nAmaMbunnadi | tUlucu bAraro duritamula |
cAli BujaMbuna cakraMbunna | tArimi BavabaMdhamulaTu tolagarO ||
ca|| aMtaryAmai hari vunnADide | ciMtalu vAyaro cittamuna |
viMtalu jevulanu viShNukathalivigo | poMta garmamulu pOrO mIru ||
ca|| kApayi SrI vEMkaTapati pEride | nApai nunnadi nayamunanu |
kOpa(pu) kAmAdi guNamulAla mI- | rEpuna kaDagaDa neMdaina bOro ||