ప|| ఇందులోనే కానవద్దా యితడు దైవమని | విందువలె నొంటిమెట్టవీరరఘరాముని ||
చ|| యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు | కందువ రాఘవుడు ఖండించినాడు |
ముందట జలధి యేమూల చొచ్చె గొండలచే | గొందిబడ గట్టివేసి కోపగించేనాడు ||
చ|| యేడనుండె మహిమలు యిందరి కితడు వచ్చి | వేడుకతో హరివిల్లు విఱిచేనాడు |
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు | కూడబట్టి సంజీవికొండ దెచ్చేనాడు ||
చ|| జము డెక్కడికి బోయ సరయవులో మోక్ష- | మమర జీవుల కిచ్చె నల్లనాడు | తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి | తిమిరి శ్రీవేంకటపతికి నేడు నాడు ||
pa|| iMdulOnE kAnavaddA yitaDu daivamani | viMduvale noMTimeTTavIraraGarAmuni ||
ca|| yeMdu cocce brahmavara mila rAvaNutalalu | kaMduva rAGavuDu KaMDiMcinADu |
muMdaTa jaladhi yEmUla cocce goMDalacE | goMdibaDa gaTTivEsi kOpagiMcEnADu ||
ca|| yEDanuMDe mahimalu yiMdari kitaDu vacci | vEDukatO harivillu virxicEnADu |
vODaka yiMdrAdu leMdu nodigi rItanibaMTu | kUDabaTTi saMjIvikoMDa deccEnADu ||
ca|| jamu DekkaDiki bOya sarayavulO mOkSha- | mamara jIvula kicce nallanADu |
temali vAnarulai yIdEvatalE baMTlairi | timiri SrIvEMkaTapatiki nEDu nADu ||