ప|| ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము | వంకలొత్తకిక మరి వద్దువద్దు యిపుడు ||
చ|| వాపులు నీకెంచనేల వాడల గొల్లెతలకు | దేవరవు గావా తెలిసినదే |
యీవలమావంక నిట్టె యేమి చూచేవు తప్పక | మోవ నాడితిమిదివో మొదలనే నేము ||
చ|| చందాలు చెప్పగనేల సతి నెత్తుక వచ్చితి- | విందుకు రాజవు గావా యెరిగినదే- |
దిందుపడి మమ్మునేల తిట్టేవు పెదవులను | నిందవేసితి మిదివో నిన్ననే నేము ||
చ|| వెలినవ్వేల పదారువేల పెండ్లాడితివి | బలిమికాడవు గావా భావించినదే |
చెలగి పులివిందల శ్రీ రంగదేవుడవని | కలసితిమిదె శ్రీ వేంకటరాయ నేము ||
pa|| iMkanEla verapu yeduTanE vunnAramu | vaMkalottakika mari vadduvaddu yipuDu ||
ca|| vApulu nIkeMcanEla vADala golletalaku | dEvaravu gAvA telisinadE |
yIvalamAvaMka niTTe yEmi cUcEvu tappaka | mOva nADitimidivO modalanE nEmu ||
ca|| caMdAlu ceppaganEla sati nettuka vacciti- | viMduku rAjavu gAvA yeriginadE- |
diMdupaDi mammunEla tiTTEvu pedavulanu | niMdavEsiti midivO ninnanE nEmu ||
ca|| velinavvEla padAruvEla peMDlADitivi | balimikADavu gAvA BAviMcinadE |
celagi puliviMdala SrI raMgadEvuDavani | kalasitimide SrI vEMkaTarAya nEmu ||