ప|| ఇంతేసి మతకాలు నే నెఱగనివా | పొంత నుండి నవ్వేవు పొద్దు వోదానీకు ||
చ|| తారుకాణాలంతే నేల తగవు నడపరాదా | గారావు నీ వెఱుగని కల్ల వున్నదా |
కూరిమి సతులమూక కూరిచి తలవంచేవు | పోరులేల పెట్టేవు పొద్దు వోదా నీకు ||
చ|| వొడ బరచగనేల వూరకే వుండగరాదా | తడివితిమా నీవింతయు నేరవా |
కడగడ లటుదొక్కి కమ్మినన్ను వేడుకొంటా | బుడికేవు నన్ను నీవు పొద్దు వోదా నీకు ||
చ|| నివ్వెరగంద నేల నిచ్చలాన నుండరాదా | జవ్వనపు నాచేత నీసలిగె కాదా |
యివ్వల శ్రీ వేంకటేశ యిట్టె నిన్ను గూడితిని | పువ్వులనేల వేసేవు పొద్దు వోదా నీకు ||
pa|| iMtEsi matakAlu nE nerxaganivA | poMta nuMDi navvEvu poddu vOdAnIku ||
ca|| tArukANAlaMtE nEla tagavu naDaparAdA | gArAvu nI verxugani kalla vunnadA | kUrimi satulamUka kUrici talavaMcEvu | pOrulEla peTTEvu poddu vOdA nIku ||
ca|| voDa baracaganEla vUrakE vuMDagarAdA | taDivitimA nIviMtayu nEravA | kaDagaDa laTudokki kamminannu vEDukoMTA | buDikEvu nannu nIvu poddu vOdA nIku ||
ca|| nivveragaMda nEla niccalAna nuMDarAdA | javvanapu nAcEta nIsalige kAdA | yivvala SrI vEMkaTESa yiTTe ninnu gUDitini | puvvulanEla vEsEvu poddu vOdA nIku ||