ప|| ఇతడొకడే సర్వేశ్వరుడు | సిత కమలాక్షుడు శ్రీ వేంకతేశుడు ||
చ|| పరమ యోగులకు భావ నిధానము | అరయ నింద్రాదుల కైశ్వర్యము |
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము | సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||
చ|| కలికి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు |
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు | చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||
చ|| తగిలిన మునులకు తపము సత్ఫలము | ముగురు వేల్పులకు మూలమీతడే |
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు | జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||
pa|| itaDokaDE sarvESvaruDu | sita kamalAkShuDu shrI vEMkatESuDu ||
ca|| parama yOgulaku BAva nidhAnamu | araya niMdrAdula kaiSvaryamu |
garima golletala kaugiTa sauKyamu | sirulosagE yI SrI vEMkaTESuDu ||
ca|| kaliki yaSOdaku kanna mANikamu talacina karikini tagudikku |
ala draupadikini ApadbaMdhuDu | celarEgina yI SrI vEMkaTESuDu ||
ca|| tagilina munulaku tapamu satPalamu | muguru vElpulaku mUlamItaDE |
voginalamElmaMga konarina patiyitaDu | jigimiMcina yI srIvEnkaTESuDu ||
itaDokaDE sarvESvaruDu - ఇతడొకడే సర్వేశ్వరుడు
6:05 AM
I- Annamayya, ఇ