ప|| ఇతర ధర్మము లందు నిందు గలదా | మతి దలప పరము నీమతముననే కలిగె ||
చ|| విదురునకు బరలోకవిధి చేసెనట తొల్లి | అదె ధర్మసుతుడు వర్ణాశ్రమంబులు విడిచి |
కదిసి నీదాసుడైన కతముననేకాదె యీ- | యెదురనే తుదిపదం బిహముననే కలిగె ||
చ|| అంటరానిగద్దకుల మంటి జటాయువుకు నీ- | వంటి పరలోకకృత్యములు సేసితివి మును |
వెంట నీకైంకర్యవిధి కలిమినేకాదె | వొంటి నీహస్తమున యోగ్యమై నిలిచె ||
చ|| యిరవైనశబరిరుచు లివియె నైవేద్యమై | పరగెనట శేషమును బహువిధములనక |
ధర దదీయప్రసాదపు విశేషమేకాదె | సిరుల శ్రీవేంకటేశ చెల్లుబడులాయె ||
pa|| itara dharmamu laMdu niMdu galadA | mati dalapa paramu nImatamunanE kalige ||
ca|| vidurunaku baralOkavidhi cEsenaTa tolli | ade dharmasutuDu varNASramaMbulu viDici |
kadisi nIdAsuDaina katamunanEkAde yI- | yeduranE tudipadaM bihamunanE kalige ||
ca|| aMTarAnigaddakula maMTi jaTAyuvuku nI- | vaMTi paralOkakRutyamulu sEsitivi munu |
veMTa nIkaiMkaryavidhi kaliminEkAde | voMTi nIhastamuna yOgyamai nilice ||
ca|| yiravainaSabarirucu liviye naivEdyamai | paragenaTa SEShamunu bahuvidhamulanaka |
dhara dadIyaprasAdapu viSEShamEkAde | sirula SrIvEMkaTESa cellubaDulAye ||
itara dharmamu laMdu - ఇతర ధర్మము లందు
5:45 AM
I- Annamayya, ఇ