ప|| ఇట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకుదురయా | పట్టము గట్టుకొంటివి పచ్చిదేరెనయ్యా ||
చ|| చెలియతోడే నీకు సింహాసనపుగద్దె | అలరుజూపులె రత్నాభిషేకాలు |
చలువైన నవ్వులే ఛత్రచామరములు | కలిగె నీకింక నేమి గావలెనయ్యా ||
చ|| చనుగవలే నీకు సామ్రాజ్య దుర్గములు | నినుపు మోవితేనెలు నిచ్చబోనాలు |
వొనరిన కౌగిలే వుండెడి నీనగరు | యెనయ నచ్చె నీ భాగ్యమీడెర నయ్యా ||
చ|| రతి చెనకులే నీకు రవణపు సొమ్ములు | సతతపుగూటమే సర్వసంపద | యితవై శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ | సతమాయ మమ్ము నేలి జాణవైతివయ్యా ||
pa|| iTTi BAgyamu gaMTimi yiddarU badukudurayA | paTTamu gaTTukoMTivi paccidErenayyA ||
ca|| celiyatODE nIku siMhAsanapugadde | alarujUpule ratnABiShEkAlu |
caluvaina navvulE CatracAmaramulu | kalige nIkiMka nEmi gAvalenayyA ||
ca|| canugavalE nIku sAmrAjya durgamulu | ninupu mOvitEnelu niccabOnAlu |
vonarina kaugilE vuMDeDi nInagaru | yenaya nacce nI BAgyamIDera nayyA ||
ca|| rati cenakulE nIku ravaNapu sommulu | satatapugUTamE sarvasaMpada |
yitavai SrIvEMkaTESa yIke yalamElumaMga | satamAya mammu nEli jANavaitivayyA ||