ప|| ఇటు గరుడని నీ వెక్కినను | పటపట దిక్కులు బగ్గన బగిలె ||
చ|| ఎగసినగరుడని యేపున ’థా’యని | జిగిదొలకచబుకు చేసినను |
నిగమాంతంబులు నిగమసంఘములు | గగనము జగములు గడ గడ వడకె ||
చ|| బిరుసుగ గరుడని పేరెము దోలుచు | బెరసి నీవు కోపించినను |
సరుస నిఖిలములు జర్జరితములై | తెరుపున నలుగడ దిరదిర దిరిగె ||
చ|| పల్లించిననీపసిడిగరుడనిని | కెల్లున నీ వెక్కినయపుడు |
ఝల్లనె రాక్షససమితి నీమహిమ- | వెల్లి మునుగుదురు వేంకటరమణా ||
pa|| iTu garuDani nI vekkinanu | paTapaTa dikkulu baggana bagile ||
ca|| egasinagaruDani yEpuna 'ThA'yani | jigidolakacabuku cEsinanu |
nigamAMtaMbulu nigamasaMGamulu | gaganamu jagamulu gaDa gaDa vaDake ||
ca|| birusuga garuDani pEremu dOlucu | berasi nIvu gOpiMcinanu |
sarusa niKilamulu jarjaritamulai | terupuna nalugaDa diradira dirige ||
ca|| palliMcinanIpasiDigaruDanini | kelluna nI vekkinayapuDu |
Jallane rAkShasasamiti nImahima- | velli munuguduru vEMkaTaramaNA ||