ప|| ఉన్నవిచారములేల వోహో సంసారులాల | యిన్నిటి కితడే రక్ష యిదే మీకు మనరో ||
చ|| తక్కక బ్రహ్మలగన్న తండ్రి గొలిచి మీరు | యెక్కువ సంతతిగల్గి యీడేరరో |
అక్కున లక్ష్మీనారాయణుల దలచి మీరు | చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో ||
చ|| భవరోగవైద్యునిపాదములు సేవించి | భువి రోగముల బాసి పొదలరో |
తవిలి పదిదిక్కులు తానైనవాని | గవిసి పొగడి దిక్కుగలిగి బ్రదుకరో ||
చ|| తల్లిదండ్రీ నీతడే తగ జుట్ట మీతడే | యెల్లగా బుట్టించి పెంచేయేలి కీతడే |
చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము | కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో ||
pa|| unnavicAramulEla vOhO saMsArulAla | yinniTi kitaDE rakSha yidE mIku manarO ||
ca|| takkaka brahmalaganna taMDri golici mIru | yekkuva saMtatigalgi yIDErarO |
akkuna lakShmInArAyaNula dalaci mIru | cokki mImIdaMpatulu suKamuna nuMDarO ||
ca|| BavarOgavaidyunipAdamulu sEviMci | Buvi rOgamula bAsi podalarO |
tavili padidikkulu tAnainavAni | gavisi pogaDi dikkugaligi bradukarO ||
ca|| tallidaMDrI nItaDE taga juTTa mItaDE | yellagA buTTiMci peMcEyEli kItaDE |
callagA SrIvEMkaTESu SaraNaMTi mide mEmu | kollagA mIrellA mammu gurxigA vardhillarO ||