ప|| ఎక్కడ చొచ్చెడి దీభవమేదియు గడపల గానము | వుక్కున బరితాపాల మూదల మండెడి ||
చ|| హృదయవికారము మాన్పగ నేతెరగును సమకూడదు | మదనానందము చెరుపగ మందేమియు లేదు |
పొదలినదేహగుణంబుల బోనడువగ గతి గానము | బ్రదికించినకోరికెలకు బ్రాయము దిరిగినది ||
చ|| కమలినయజ్ఞానం బిది కన్నులముందర గానదు | తిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదు |
తెమలనియాశాపాశము తెంపగ సత్వము చాలదు | మమకారము వెడలింపగ మతి యెప్పుడు లేదు ||
చ|| దురితంబులు పుణ్యంబులు తొడిబడ నాత్మను బెనగొని | జరగగ శరీరధారికి సత్కర్మము లేదు |
తిరువేంకటగిరిపతియగు దేవశిఖామణిపాదము | శరణని బ్రదుకుటదప్పను సన్మార్గము లేదు ||
pa|| ekkaDa cocceDi dIBavamEdiyu gaDapala gAnamu | vukkuna baritApAla mUdala maMDeDi ||
ca|| hRudayavikAramu mAnpaga nEteragunu samakUDadu | madanAnaMdamu cerupaga maMdEmiyu lEdu |
podalinadEhaguNaMbula bOnaDuvaga gati gAnamu | bradikiMcinakOrikelaku brAyamu diriginadi ||
ca|| kamalinayaj~jAnaM bidi kannulamuMdara gAnadu | timiramu podigoni cUDkiki deruvEmiyu lEdu |
temalaniyASApASamu teMpaga satvamu cAladu | mamakAramu veDaliMpaga mati yeppuDu lEdu ||
ca|| duritaMbulu puNyaMbulu toDibaDa nAtmanu benagoni | jaragaga SarIradhAriki satkarmamu lEdu |
tiruvEMkaTagiripatiyagu dEvaSiKAmaNipAdamu | SaraNani bradukuTadappanu sanmArgamu lEdu ||