ప|| ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు | కందువెఱిగి చీకటిదవ్వుకొనుగాక ||
చ|| తలరాయిగాగ నెందరికి మొక్కెడిని | తెలివిమాలినయట్టిదేహి |
కొలదిమీరిన దేవకోట్లు దనలోన | కలవాని నొక్కనినే కొలుచుగాక ||
చ|| కాలీచపడగ నెక్కడికి నేగెడివి | పాలుమాలిన యట్టిప్రాణి |
మేలిమిజగములు మేనిలో గలవాడు | పాలిటివాడై ప్రణుతికెక్కుగాక ||
చ|| నూరేండ్ల నెందరి నుతియింపగలవాడు | చేరదావులేని జీవి |
శ్రీరమణుడు శ్రీవేంకటేశుని | కోరికె దలచి ముక్తి కొల్లగొనుటగాక ||
pa|| eMdariveMTa neTla dirugavaccu | kaMduverxigi cIkaTidavvukonugAka ||
ca|| talarAyigAga neMdariki mokkeDini | telivimAlinayaTTidEhi |
koladimIrina dEvakOTlu danalOna | kalavAni nokkaninE kolucugAka ||
ca|| kAlIcapaDaga nekkaDiki nEgeDivi | pAlumAlina yaTTiprANi |
mElimijagamulu mEnilO galavADu | pAliTivADai praNutikekkugAka ||
ca|| nUrEMDla neMdari nutiyiMpagalavADu | cEradAvulEni jIvi |
SrIramaNuDu SrIvEMkaTESuni | kOrike dalaci mukti kollagonuTagAka ||