ప|| ఎంతచేసిన తనకేది తుద | చింత శ్రీహరిపై జిక్కుటే చాలు ||
చ|| ఎడపక పుణ్యాలెన్ని చేసినా | గడమే కాకిక గడయేది |
తడబడ హరియే దైవమనుచు మది | విడువకవుండిన వెరవే చాలు ||
చ|| యెన్నితపములివి యెట్లజేసినా | అన్నువ కధికము అలవేది |
వన్నెల గలగక వనజాక్షునిపై | వున్న చిత్తమది వొక్కటే చాలు ||
చ|| యిందరి వాదములెల్ల గెలిచినా | కందే గాకిక గరిమేది |
యిందరినేలిన యీవేంకటపతి | పొందుగ మహిమల పొడవే చాలు ||
pa|| eMtacEsina tanakEdi tuda | ciMta SrIharipai jikkuTE cAlu ||
ca|| eDapaka puNyAlenni cEsinA | gaDamE kAkika gaDayEdi |
taDabaDa hariyE daivamanucu madi | viDuvakavuMDina veravE cAlu ||
ca|| yennitapamulivi yeTlajEsinA | annuva kadhikamu alavEdi |
vannela galagaka vanajAkShunipai | vunna cittamadi vokkaTE cAlu ||
ca|| yiMdari vAdamulella gelicinA | kaMdE gAkika garimEdi |
yiMdarinElina yIvEMkaTapati | poMduga mahimala poDavE cAlu ||