ప|| ఎంతైన దొలగవై తేదైన నామతికి | వింతచవినేతుగా విషయబుద్ధి ||
చ|| ఎనసి జన్మముల నే నెట్లనుండిన బోక | వెనక దిరుగుదువుగా విషమబుద్ధి |
అనువైన యనుభవన లనుభవించగజేసి | వెనక మఱపింతుగా విషయబుద్ధి ||
చ|| కెఱలి కాంతలు నేను గినిసినను బొలయలుక | విఱిచి కలపుదువుగా విషయబుద్ధి |
తఱితోడ వావివర్తనదలంచిననన్ను | వెఱపు దెలుపుదువుగా విషయబుధి ||
చ|| యెడలేనియాపదల నెట్లువొరలిన నన్ను | విడిచిపోవైతిగా విషయబుద్ధి |
సడిబెట్టి వేంకటస్వామికృపచే నిన్ను | విడిపించవలనెగా విషయబుద్ధి ||
pa|| eMtaina dolagavai tEdaina nAmatiki | viMtacavinEtugA viShayabuddhi ||
ca|| enasi janmamula nE neTlanuMDina bOka | venaka diruguduvugA viShamabuddhi |
anuvaina yanuBavana lanuBaviMcagajEsi | venaka marxapiMtugA viShayabuddhi ||
ca|| kerxali kAMtalu nEnu ginisinanu bolayaluka | virxici kalapuduvugA viShayabuddhi |
tarxitODa vAvivartanadalaMcinanannu | verxapu delupuduvugA viShayabudhi ||
ca|| yeDalEniyApadala neTluvoralina nannu | viDicipOvaitigA viShayabuddhi |
saDibeTTi vEMkaTasvAmikRupacE ninnu | viDipiMcavalanegA viShayabuddhi ||