ప|| ఎంతమోహమో నీకీ ఇంతి మీదను | వింత వింత వేడుకల మీదను ||
చ|| తరుణిగుబ్బలు నీకు దలగడ బిల్లలుగా- | నొరగు కొన్నాడవు వుబ్బున నీవు |
దొరవై పయ్యెదకొంగు దోమతెర బాగుగ | సరుగ మాటుక సేసుక జాణవై వున్నాడవు ||
చ|| భామిని తొడలు నీకు పట్టెమంచము లాగున- | నాముకొని పవ్వళించే వప్పటి నీవు |
గోముతోడ పట్టుచీర కుచ్చెల వరపుగాగ | కామించి ఇట్టె కోడెకడవై వున్నాడవు ||
చ|| వనిత కాగిలి నీకు వాసన చప్పరముగ- | నునికు సేసు కున్నాడ వొద్దికై నీవు |
యెనసితివి శ్రీవేంకటేశ యలమేలుమంగను | అనిశము సింగారరాయడవై వున్నాడవు ||
pa|| eMtamOhamO nIkI iMti mIdanu | viMta viMta vEDukala mIdanu ||
ca|| taruNigubbalu nIku dalagaDa billalugA- | noragu konnADavu vubbuna nIvu |
doravai payyedakoMgu dOmatera bAguga | saruga mATuka sEsuka jANavai vunnADavu ||
ca|| BAmini toDalu nIku paTTemaMcamu lAguna- | nAmukoni pavvaLiMcE vappaTi nIvu |
gOmutODa paTTucIra kuccela varapugAga | kAmiMci iTTe kODekaDavai vunnADavu ||
ca|| vanita kAgili nIku vAsana capparamuga- | nuniku sEsu kunnADa voddikai nIvu |
yenasitivi SrIvEMkaTESa yalamElumaMganu | aniSamu siMgArarAyaDavai vunnADavu ||