ప|| ఎంతసేయగలేదు యిటువంటివిధి యభవు- | నంతవానిని భిక్షమడుగుకొన జేసె ||
చ|| కోరిచంద్రుని బట్టి గురుతల్పగుని జేసె | కూరిమలరగ నింద్రు గోడి జేసె |
ఘోరకుడువగ ద్రిశంకుని నంత్యజుని జేసె | వీరుడగునలు బట్టి విరూపుజేసె ||
చ|| అతివనొడ్డుగ జూదమాడ ధర్మజు జేసె | సతినమ్ముకొన హరిశ్చంద్రు జేసె |
కుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగ జేసె | మతిమాలి కురురాజు మడుగచొరజేసె ||
చ|| పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోజేసె | తొడరి కాలునుకాలు దునియజేసె |
అడర నీవిధికి విధియగు వేంకటేశుకృప | పడయకుండగ భంగపడకపోరాదు ||
pa|| eMtasEyagalEdu yiTuvaMTividhi yaBavu- | naMtavAnini BikShamaDugukona jEse ||
ca|| kOricaMdruni baTTi gurutalpaguni jEse | kUrimalaraga niMdru gODi jEse |
GOrakuDuvaga driSaMkuni naMtyajuni jEse | vIruDagunalu baTTi virUpujEse ||
ca|| ativanoDDuga jUdamADa dharmaju jEse | satinammukona hariScaMdru jEse |
kutilapaDa SUdrakuni gorxrxemuccuga jEse | matimAli kururAju maDugacorajEse ||
ca|| paDanipATla baraci brahmatala vOjEse | toDari kAlunukAlu duniyajEse |
aDara nIvidhiki vidhiyagu vEMkaTESukRupa | paDayakuMDaga BaMgapaDakapOrAdu ||