ప|| ఎట్టు దరించీ నిదె యీజీవుడు | బట్టబయలుగా బరచీ నొకటి ||
చ|| చెడనిమట్టిలో జేసినముద్దే | నడుమ ముంచుకొన్నది నొకటి |
తడియనినీరై తడివొడమింపుచు | పడిసీని వేవుర వడితో నొకటి ||
చ|| పాయనితనుదీపనములుగా నటు | చేయుచు మది వేచీ నొకటి |
కాయపుచుట్టరికమ్ములు చేయుచు | రేయిబగలు విహరించీ నొకటి ||
చ|| ఇన్నియు దానే యేచి కపటములు | పన్నీ నిదె లోపల నొకటి |
వెన్నెలచూపుల వేంకటేశ నిను | యెన్నికతో గడు నెదిరీ నొకటి ||
pa|| eTTu dariMcI nide yIjIvuDu | baTTabayalugA baracI nokaTi ||
ca|| ceDanimaTTilO jEsinamuddE | naDuma muMcukonnadi nokaTi |
taDiyaninIrai taDivoDamiMpucu | paDisIni vEvura vaDitO nokaTi ||
ca|| pAyanitanudIpanamulugA naTu | cEyucu madi vEcI nokaTi |
kAyapucuTTarikammulu cEyucu | rEyibagalu vihariMcI nokaTi ||
ca|| inniyu dAnE yEci kapaTamulu | pannI nide lOpala nokaTi |
vennelacUpula vEMkaTESa ninu | yennikatO gaDu nedirI nokaTi ||