ప|| ఎట్టు గూడె బెండ్లి యోగమిద్దరికి నీవేళ | అట్టు లక్ష్మీనారాయణ యోగము ||
చ|| నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు | పొలతి నీకు గూడె పొంతనాలు |
వలుద చక్రవాకాలు వనితకు చాలు నీకు | యెలమి జక్రాయుధుడ నిద్దరికి దగును ||
చ|| తరుణి నీలకుంతల తగునీల వర్ణుడవు | సరుస మీకే తగు సమ్మంధము |
నిరతి హేమవర్ణకె నీవు పీతాంబరుడవు | పరవి నిద్దరకొక్క జాతియ్యము ||
చ|| పాలవెల్లి బుట్టె నాకె పాలవెల్లి యిల్లు నీకు | మేలు మేలు యిద్దరికి మేనవావి |
యీలీల శ్రీ వేంకటేశ యింతి నీవు గూడితివి | పోలి మాకు పెట్టరాదా సోబన విడేలు ||
pa|| eTTu gUDe beMDli yOgamiddariki nIvELa | aTTu lakShmInArAyaNa yOgamu ||
ca|| nelata kamalavAsi nIvu kamalAkShuDavu | polati nIku gUDe poMtanAlu |
valuda cakravAkAlu vanitaku cAlu nIku | yelami jakrAyudhuDa niddariki dagunu ||
ca|| taruNi nIlakuMtala tagunIla varNuDavu | sarusa mIkE tagu sammaMdhamu |
nirati hEmavarNake nIvu pItAMbaruDavu | paravi niddarakokka jAtiyyamu ||
ca|| pAlavelli buTTe nAke pAlavelli yillu nIku | mElu mElu yiddariki mEnavAvi |
yIlIla SrI vEMkaTESa yiMti nIvu gUDitivi | pOli mAku peTTarAdA sObana viDElu ||