ప|| ఔనయ్య జాణడువు ప్రహ్లాద వరద | ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరద ||
చ|| వేసరక శ్రీసతితో వేడుక నవ్వులు నవ్వి | ఆసలు చూపేవు ప్రహ్లాద వరద |
సేస వెట్టిన చేతుల చెరగు వట్టి తిసేవు | ఆ సుద్దులె చెప్పేను ప్రహ్లాద వరద ||
చ|| నంటున తొడమీదను నలినాక్షి నెక్కించుక | అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరద |
గెంటుక ఏ పొద్దును కేలుకేలు కీలించుక | అంటువాయ వదివో ప్రహ్లాద వరద ||
చ|| కందువతో కాగిలించి కైవసము సేసుకొంటి- | వందముగ నీకెను ప్రహ్లాద వరద |
పొంది శ్రీవేంకటమున పొంచి ఔభళములోన | అంది వరాలిచ్చేవు ప్రహ్లాద వరద ||
pa|| aunayya jANaDuvu prahlAda varada | Asalu veTTakumu prahlAdavarada ||
ca|| vEsaraka SrIsatitO vEDuka navvulu navvi | Asalu cUpEvu prahlAda varada |
sEsa veTTina cEtula ceragu vaTTi tisEvu | A suddule ceppEnu prahlAda varada ||
ca|| naMTuna toDamIdanu nalinAkShi nekkiMcuka | aMTEvu siggulu prahlAdavarada |
geMTuka E poddunu kElukElu kIliMcuka | aMTuvAya vadivO prahlAda varada ||
ca|| kaMduvatO kAgiliMci kaivasamu sEsukoMTi- | vaMdamuga nIkenu prahlAda varada |
poMdi SrIvEMkaTamuna poMci auBaLamulOna | aMdi varAliccEvu prahlAda varada ||
Sung by:Balakrishna Prasad
Sung by:Srividya
|