ప|| ఏడ సుజ్ఞానమేడ తెలివి నాకు | బూడిదలో హోమమై పోయ గాలము ||
చ|| ఇదె మేలయ్యెడి నాకదె మేలయ్యెడి నని | కదిసియాసచే గడవలేక |
యెదురు చూచిచూచి యెలయించి యెలయించి | పొదచాటు మృగమై పోయ గాలము ||
చ|| ఇంతట దీరెడి దుఃఖమంతట దీరెడినని | వింతవింత వగలచే వేగివేగి |
చింతయు వేదనల జిక్కువడుచు నగ్ని- | పొంతనున్న వెన్నయై పోయ గాలము ||
చ|| యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని | యెక్కడికైనా నూరి కేగియేగి |
గక్కన శ్రీతిరువేంకటపతి గానక | పుక్కిటిపురాణమయి పోయ గాలము ||
pa|| EDa suj~jAnamEDa telivi nAku | bUDidalO hOmamai pOya gAlamu ||
ca|| ide mElayyeDi nAkade mElayyeDi nani | kadisiyAsacE gaDavalEka |
yeduru cUcicUci yelayiMci yelayiMci | podacATu mRugamai pOya gAlamu ||
ca|| iMtaTa dIreDi duHKamaMtaTa dIreDinani | viMtaviMta vagalacE vEgivEgi |
ciMtayu vEdanala jikkuvaDucu nagni- | poMtanunna vennayai pOya gAlamu ||
ca|| yikkaDa suKamu nAkakkaDa suKaMbani | yekkaDikainA nUri kEgiyEgi |
gakkana SrItiruvEMkaTapati gAnaka | pukkiTipurANamayi pOya gAlamu ||