Learn English Vocabulary & Help the Poor| Vocaulary |<><><><><>Free download annamayya annamacarya top popular audio video songs lyrics music sung by bala subrahmanyam murali krishna prasad mangalampalli priya sisters nitya santoshini sobha raju SP sailaja etc

Edi cUcinanu - ఏది చూచినను

ఏది చూచినను (రాగం: ) (తాళం : )

ప|| ఏది చూచినను గడు నిటువంటిసోయగములే | మేదినికి గిందుపడి మిన్నందనేలా ||

చ|| కరిరాజుగాంచిన కరుణానిధివి నీవు | అరిది నరసింహరూపైతివేలా |
వురగేంద్రశయనమున నుండి నీవును సదా | గరుడవాహనౌడవై గమనించరాదా ||

చ|| పురుషోత్తమఖ్యాతి బొదలి యమృతము వంప | తరుణివై వుండ నిటు దైన్యమేలా |
శరణాగతులకు రక్షకుడవై పాము నీ- | చరణములకిందైన చలముకొననేలా ||

చ|| దేవతాధిపుడవై దీపించి యింద్రునకు | భావింప తమ్ముడన బరగితేలా
శ్రీవేంకటాచలస్థిరుడవై లోకముల- | జీవకోట్లలోన జిక్కువడనేలా ||

Edi cUcinanu (Raagam: ) (Taalam: )

pa|| Edi cUcinanu gaDu niTuvaMTisOyagamulE | mEdiniki giMdupaDi minnaMdanElA ||

ca|| karirAjugAMcina karuNAnidhivi nIvu | aridi narasiMharUpaitivElA |
vuragEMdraSayanamuna nuMDi nIvunu sadA | garuDavAhanauDavai gamaniMcarAdA ||

ca|| puruShOttamaKyAti bodali yamRutamu vaMpa | taruNivai vuMDa niTu dainyamElA |
SaraNAgatulaku rakShakuDavai pAmu nI- | caraNamulakiMdaina calamukonanElA ||

ca|| dEvatAdhipuDavai dIpiMci yiMdrunaku | BAviMpa tammuDana baragitElA
SrIvEMkaTAcalasthiruDavai lOkamula- | jIvakOTlalOna jikkuvaDanElA ||