ప|| ఏదియునులేని దేటిజన్మము | వేదాంతవిద్యావివేకి గావలెను ||
చ|| పరమమూర్తి ధ్యానపరుడు గావలె నొండె | పరమానంద సంపదలొందవలెను |
పరమార్థముగ నాత్మభావింపవలె నొండె | పరమే తానై పరగుండవలెను ||
చ|| వేదశాస్త్రార్థకోవిదుడుగావలె నొండె | వేదాంతవిదుల సేవించవలెను |
కాదనక పుణ్యసత్కర్మి గావలె నొండె | మోదమున హరిభక్తి మొగినుండవలెను ||
చ|| సతతభూతదయావిచారి గావలె నొండె | జితమైనయింద్రియస్థిరుడు గావలెను |
అతిశయంబగు వేంకటాద్రీశు సేవకులై | గతియనుచు తనబుద్ధి గలిగుండవలెను||
pa|| EdiyunulEni dETijanmamu | vEdAMtavidyAvivEki gAvalenu ||
ca|| paramamUrti dhyAnaparuDu gAvale noMDe | paramAnaMda saMpadaloMdavalenu |
paramArthamuga nAtmaBAviMpavale noMDe | paramE tAnai paraguMDavalenu ||
ca|| vEdaSAstrArthakOviduDugAvale noMDe | vEdAMtavidula sEviMcavalenu |
kAdanaka puNyasatkarmi gAvale noMDe | mOdamuna hariBakti moginuMDavalenu ||
ca|| satataBUtadayAvicAri gAvale noMDe | jitamainayiMdriyasthiruDu gAvalenu |
atiSayaMbagu vEMkaTAdrISu sEvakulai | gatiyanucu tanabuddhi galiguMDavalenu||