ప|| ఏకతాన వున్నవాడు యిదివో వీడె | చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు ||
చ|| మంచిమంచిపన్నీట మజ్జన మవధరించి | పంచమహావాద్యాలతో పరమాత్ముడు |
అంచల గప్పురకాపు అంగముల మెత్తుకొని | కొంచక నిలుచున్నాడు గోణాముతోడను ||
చ|| తట్టపుణుగామీద దట్టముగ నించుకొని | తెట్టలై వేదనాదాల దేవదేవుడు |
గుట్టుతోడ సొమ్ములెల్లా గుచ్చి కుచ్చి కట్టుకొని | వెట్టదీర సురట్ల విసరించుకొంటాను ||
చ|| తనిసి యలమేల్మంగ దాళిగా గట్టుకొనె | వెనుకొని యిదివో శ్రీవేంకటేశుడు |
మునుకొని యారగించి మూడులోకములు మెచ్చ | చనవరిసతులతో సరసమాడుతాను ||
pa|| EkatAna vunnavADu yidivO vIDe | cEkoni mokkarO mIru cEtuletti yipuDu ||
ca|| maMcimaMcipannITa majjana mavadhariMci | paMcamahAvAdyAlatO paramAtmuDu |
aMcala gappurakApu aMgamula mettukoni | koMcaka nilucunnADu gONAmutODanu ||
ca|| taTTapuNugAmIda daTTamuga niMcukoni | teTTalai vEdanAdAla dEvadEvuDu |
guTTutODa sommulellA gucci kucci kaTTukoni | veTTadIra suraTla visariMcukoMTAnu ||
ca|| tanisi yalamElmaMga dALigA gaTTukone | venukoni yidivO SrIvEMkaTESuDu |
munukoni yAragiMci mUDulOkamulu mecca | canavarisatulatO sarasamADutAnu ||