ప|| ఏకాత్మవాదులాల యిందుకేది వుత్తరము | మీకు లొకవిరోధ మేమిట బాసీ నయ్యలాల ||
చ|| పాపమొక్కడు సేసితే పాపులే యిందరు గావలదా | యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా |
కోపించి యొక్కడసురైతే కోరి యిందరు గావలదా | చూప దేవుడొక్కడైతే సురలిందరు గావలదా ||
చ|| వొకడపవిత్రుడైతే నొగి నిందరు గావలదా | వొకడు శుచైవుండితె వోడకిందరు గావలదా ||
వొకనిరతి సుఖమంటి యిందరును వొనర బొందవలదా | వొకని దుఃఖమందరు వూర బంచుకోవలదా ||
చ|| ఆకడ నొకడు ముక్తుడయితే నందరును గావలదా | దీకొని యొకడు బద్ధుడైతే యిందరు గావలదా|
చేకొని శ్రీవేంకటేశు జేరి దాసులయి యుండేటి | లోకపుమునులను దెలుసుకోవలదా ||
pa|| EkAtmavAdulAla yiMdukEdi vuttaramu | mIku lokavirOdha mEmiTa bAsI nayyalAla ||
ca|| pApamokkaDu sEsitE pApulE yiMdaru gAvaladA | yEpuna vokaripuNya miMdariki rAvaladA |
kOpiMci yokkaDasuraitE kOri yiMdaru gAvaladA | cUpa dEvuDokkaDaitE suraliMdaru gAvaladA ||
ca|| vokaDapavitruDaitE nogi niMdaru gAvaladA | vokaDu SucaivuMDite vODakiMdaru gAvaladA ||
vokanirati suKamaMTi yiMdarunu vonara boMdavaladA | vokani duHKamaMdaru vUra baMcukOvaladA ||
ca|| AkaDa nokaDu muktuDayitE naMdarunu gAvaladA | dIkoni yokaDu baddhuDaitE yiMdaru gAvaladA|
cEkoni SrIvEMkaTESu jEri dAsulayi yuMDETi | lOkapumunulanu delusukOvaladA ||