ప|| ఏల మోసపోయిరొకో యెంచి యాకాలపువారు | బాలకృష్ణునిబంట్లై బ్రదుకవద్దా ||
చ|| పసులగాచేవాని బ్రహ్మ నుతించెనంటేను | దెసలదేవుడేయని తెలియవద్దా |
సిసువు గోవర్ధనాద్రి చేతబట్టి యెత్తెనంటే | కొసరీతని పాదాలే కొలువవద్దా ||
చ|| నరునికి విశ్వరూ పున్నతి జూపెనంటేను | నరహరి యితడని నమ్మవద్దా |
పరగ జక్రముచేత బాణుని నఱకెనంటే | సొరి దీతని శరణుచొఱవద్దా ||
చ|| అందరుసురలలోన నగ్రపూజ గొన్నప్పుడే| చెంది యీతనికృపకు జేరవద్దా |
అంది శ్రీవేంకటేశు డట్టె ద్రిష్టదైవమంటే | విందుల బరులసేవ విడువవద్దా ||
pa|| Ela mOsapOyirokO yeMci yAkAlapuvAru | bAlakRuShNunibaMTlai bradukavaddA ||
ca|| pasulagAcEvAni brahma nutiMcenaMTEnu | desaladEvuDEyani teliyavaddA |
sisuvu gOvardhanAdri cEtabaTTi yettenaMTE | kosarItani pAdAlE koluvavaddA ||
ca|| naruniki viSvarU punnati jUpenaMTEnu | narahari yitaDani nammavaddA |
paraga jakramucEta bANuni narxakenaMTE | sori dItani SaraNucorxavaddA ||
ca|| aMdarusuralalOna nagrapUja gonnappuDE| ceMdi yItanikRupaku jEravaddA |
aMdi SrIvEMkaTESu DaTTe driShTadaivamaMTE | viMdula barulasEva viDuvavaddA ||