ప|| ఏలవచ్చీ యేలపోయీ నెందుండీ బ్రాణి | తోలుతిత్తిలోన జొచ్చి దుంక దూరనా ||
చ|| పుట్టులేక నరకాలపుంగుడై తానుండక యీ- | పుట్టుగున కేల వచ్చీ పోయీ బ్రాణి |
పుట్టుచునే కన్నవారి బుట్టినవారి నాసల | బెట్టిపెట్టి దుఃఖముల బెడరేచనా ||
చ|| భూతమై యడవిలో బొక్కుచు దానుండక యీ- | బూతుజన్మమేల మోచె బుచ్చినప్రాణి |
రాతిరిబగలు ఘొరపుబాటు వడిపడి | పాతకాలు చేసి యమబాధబడనా ||
చ|| కీటమై వేంకటగిరి కిందనైన నుండక యీ- | చేటువాటుకేల నోచె చెల్లబో ప్రాణి |
గాటమైనసంపదల కడలేనిపుణ్యాల- | కోటికి బడగెత్తక కొంచెపడనా ||
pa|| ElavaccI yElapOyI neMduMDI brANi | tOlutittilOna jocci duMka dUranA ||
ca|| puTTulEka narakAlapuMguDai tAnuMDaka yI- | puTTuguna kEla vaccI pOyI brANi |
puTTucunE kannavAri buTTinavAri nAsala | beTTipeTTi duHKamula beDarEcanA ||
ca|| BUtamai yaDavilO bokkucu dAnuMDaka yI- | bUtujanmamEla mOce buccinaprANi |
rAtiribagalu GorapubATu vaDipaDi | pAtakAlu cEsi yamabAdhabaDanA ||
ca|| kITamai vEMkaTagiri kiMdanaina nuMDaka yI- | cETuvATukEla nOce cellabO prANi |
gATamainasaMpadala kaDalEnipuNyAla- | kOTiki baDagettaka koMcepaDanA ||