ప|| ఏలోకమందున్నా నేమీ లేదు | తాలిమి నందుకుదగ్గదావతేకాని ||
చ|| సురల కసురలకు సూడునుబాడునే కాని | పొరసి సుఖించగ బొద్దు లేదు |
ధరలో ఋషులకును తపము సేయనేకాని | మరిగి భోగించగ మరి పొద్దు లేదు ||
చ|| గక్కన సిద్దులకైనా గంతయు బొంతయేకాని | చిక్కిపరుసము గలిగి నెలవులేదు |
రెక్కలు గలపక్షికి రేసుతిమ్మటలేకాని | చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు ||
చ|| సకల జంతువులకు జన్మాదులేకాని | అకటా నిత్యానంద మందలేదు |
వెకలి శ్రీవేంకటేశు విష్ణుదాసులకే మంచి- | సుకములెల్లా గలవు సుడివడలేదు ||
pa|| ElOkamaMdunnA nEmI lEdu | tAlimi naMdukudaggadAvatEkAni ||
ca|| surala kasuralaku sUDunubADunE kAni | porasi suKiMcaga boddu lEdu |
dharalO RuShulakunu tapamu sEyanEkAni | marigi BOgiMcaga mari poddu lEdu ||
ca|| gakkana siddulakainA gaMtayu boMtayEkAni | cikkiparusamu galigi nelavulEdu |
rekkalu galapakShiki rEsutimmaTalEkAni | cakka vaikuMThAna kegaya sattuva lEdu ||
ca|| sakala jaMtuvulaku janmAdulEkAni | akaTA nityAnaMda maMdalEdu |
vekali SrIvEMkaTESu viShNudAsulakE maMci- | sukamulellA galavu suDivaDalEdu ||